రైతు సమస్యలే ఎజెండాగా దద్దరిల్లిన అసెంబ్లీ

8telangagana_images_news_sep15_29_thumb_medium300_225రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీ డిస్కస్ చేసింది. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఫాలో అయ్యాయి. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి జరిగిన రైతు మరణాలకు నష్టపరిహారం అమలుచేస్తామని సర్కారు ప్రకటించింది. గత ప్రభుత్వాలను విమర్శించిన ప్రభుత్వంపై.. అపోజిషన్ ఎదురుదాడి చేసింది.

ఆరు రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్టుగానే… క్వశ్చన్ అవర్ ను సస్పెండ్ చేసి రైతు సమస్యలపై చర్చకు సర్కారు ఓకే చెప్పడంతో అన్ని పార్టీలు సహకరించాయి. సభ ప్రారంభం కాగానే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై చర్చకు ఎంఐఎం పట్టుబట్టినా.. సీఎం రిక్వెస్ట్ చేయడంతో వెనక్కి తగ్గింది.

telangana-assembly-ptiతర్వాత… అజెండాలో చేర్చిన రైతు సమస్యలపై చర్చను వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మొదలుపెట్టారు. రాష్ట్రంలో కరువు, సాగు పరిస్థితులు వివరించిన పోచారం.. వర్షాభావం వల్ల రైతులు చనిపోవడం బాధాకరమన్నారు. మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ రుణమాఫీని ఒకే దఫాలో చెల్లించడంపై పరిశీలిస్తామన్న మంత్రి.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అమలు చేస్తామని చెప్పారు.

గత ప్రభుత్వ పాపాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని పోచారం చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. రైతు ఆత్మహత్యలకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను విమర్శించి ప్రభుత్వం తప్పించుకోవాలని చూడొద్దని ఫైరయ్యారు. రైతు సమస్యలు అనే అజెండాతో కాక.. రైతు ఆత్మహత్యలపై చర్చ జరగాలన్న జానారెడ్డికి ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు.

కొత్త ప్రభుత్వం వచ్చినప్పటినుంచి 14వందల మంది చనిపోయారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సంఖ్య తక్కువచేయడం వల్ల సమస్య చిన్నదైపోదని అన్నారు. కరువు, వరద నష్టాలపై నివేదికను రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపించడం లేదని విమర్శించారు.

అప్పులు తీర్చే దారిలేకే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్. కరువుతో అల్లాడుతున్నారని… నకిలీ విత్తనాలు… ఎరువులు అన్నదాతను దగాచేస్తున్నాయని అన్నారు. దశలవారీ పద్ధతిలో రుణమాఫీ చేయాలన్న సర్కారు నిర్ణయంవల్లే రైతులకు భారీనష్టం జరిగిందని.. బ్యాంకులు లోన్లు ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలన్నారు లక్ష్మణ్.  భవిష్యత్తుపై రైతుల్లో నమ్మకం కలిగే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్. నిజనిర్ధారణ కమిటీ వేసి కారణాలు విశ్లేషించాలని అన్నారు. అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వినిపించిన తర్వాత… సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. లాస్టియర్ జూన్ 2నుంచి రైతులకు నష్టపరిహారం అందివ్వడం.. మలివిడత రుణమాఫీ అమలుకు సర్కారు హామీ ఇవ్వడం… తమ ఘనతేనని ప్రతిపక్ష పార్టీలు చెప్పుకున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy