రైలు కింద పడి 500 గొర్రెలు మృతి

goatయాదాద్రి భువవనగిరి జిల్లాలో దారుణం జరిగింది. రైల్ ప్రమాదంలో ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 5వందల గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటన రామన్నపేట రైల్వే ట్రాక్ పై ఆదివారం (అక్టోబర్ -22) జరిగింది. కేతేపల్లి, కాసనగోడు, ఇప్పలగూడెం గ్రామాలకు చెందిన గొర్రె కాపరుల గొర్రెలు గడ్డి మేసుకుంటూ.. రామన్న పేట సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లాయి. ఇంతలో మందలోని ఓ గొర్రె ట్రాక్‌పైకి వచ్చింది. అదే సమయంలో ఎదురుగా ఫలక్ నూమా రైలు వచ్చింది. రైలు వెళ్లిపోయాక చూస్తే సుమారు 500 గొర్రెలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. ట్రైన్ ప్రయాణించే మార్గంలో ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పైకి గొర్రెల మంద రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
జరిగిన బీభత్సాన్ని చూసి ఆ గొర్రెల కాపరులు గుండెలు బాదుకున్నాడు. ట్రాక్ వెంట కుప్పలు తెప్పలుగా పడి ఉన్న ఆ భయానక దృశ్యం పలువురుని కంటతడి పెట్టించింది. నిరుపేదలైన ఆ యాదవులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు స్థానికులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy