రైలు పట్టాలపై బాలుడి మృతదేహం

train2411సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలం వెలిమేల దగ్గర దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం (నవంబర్-24) రైలు పట్టాలపై ఓ బాలుడి మృతదేహం కలకలం సృష్టించింది. ఇది గమనించిన స్థానికులు మోడల్ స్కూల్ విద్యార్థి వరుణ్ గౌడ్‌గా గుర్తించారు. మోడల్ స్కూల్ లో వరుణ్ 9వ తరగతి చదువుతున్నాడు. స్థానికులు ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఆ బాలుడు ప్రమాదవశాత్తు ట్రైయిన్ కింద పడ్డాడా..లేదా ఎవరైనా కావాలనే చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తోన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడు మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy