రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్

train-accidentమరో  రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ మంగళవారం (ఆగస్టు29) తెల్లవారుజామున పట్టాలు తప్పింది. వాసింద్, అసంగావ్ స్టేషన్ల మధ్య టిట్వాలా సమీపంలో ఇంజిన్‌తో సహా నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు వెళ్లిపోయాయి. ఈ ప్రమాదంలో కొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి తోడు ఓ వైపు వర్షం కురుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

గత 10 రోజుల్లో దేశంలో రైళ్లు పట్టాలు తప్పడం ఇది నాలుగోసారి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy