రైలు వెనక రైలు : ప్రతి 7 నిమిషాలకో మెట్రో సర్వీస్

KTRహైదరాబాద్ నగర ప్రజల సౌకర్యం కోసం మెట్రో సర్వీసులను మరింత పెంచనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 21వ తేదీ శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(CMRS) అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

మియాపూర్ – అమీర్‌పేట్ – నాగోల్ మధ్య శనివారం, ఏప్రిల్ 21 ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు మెట్రో రైలు.. రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఒక రైలు బయల్దేరనుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy