రైల్వేతోనే కాశ్మీర్ అభివృద్ధి సాధ్యం..!

modi and omerరైల్వేతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే రైల్వే లైన్లు ఎక్కువగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు కేటాయించి పూర్తి చేయాలన్నారు అబ్దుల్లా. దేశ రైల్వే లైన్లతో జమ్మూ కాశ్మీర్ కు లింక్ లేదని ఆయన చెప్పారు. కాత్రా రైల్వే లైన్ శంకుస్థాపన చేయడానికి వచ్చిన మోడీని ఉద్ద్యేశించి రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అబ్దుల్లా పీఎంను కోరారు.  పూంచ్-రాజోరీ రైల్వే ట్రాక్ లను విస్తరించాలని ఆయన కోరారు.

కాశ్మీర్ లో ఎక్కువ రైల్వే ప్రాజెక్టులు నిర్మించాలనేది మాజీ పీఎం అటల్ బీహార్ వాజ్ పేయ్ కోరికని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు ఉధంపూర్-కాత్రా మధ్య కొత్త ట్రైన్ ను స్టార్ట్ చేసిన ప్రధాని మోడీకి శుభాకాంక్షలు చెప్పారు.  రాష్ట్రంలో కొన్ని టూరిజం ప్రాంతాలకు రైల్వే మార్గాలు నిర్మించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అబ్దుల్లా అన్నారు. వైష్టోదేవీ ఆలయానికి త్వరగా చేరుకోనే విధంగా కాత్రా-ఉధంపూర్ ల మధ్య శ్రీ శక్తి ట్రైన్ ను మోడీ స్టార్ట్ చేశారు. దాదాపు 12 వందల కోట్లతో నిర్మించిన ఈ రైల్వే లైన్ లో దాదాపు 25 కిలో మీటర్ల మధ్య 10 సొరంగాలు ఉంటాయి. దీన్ని పూర్తి చేయడానికి పదేళ్లగా పైగా టైం పట్టింది. కాశ్మీర్ రాష్ట్రంలో మిగతా కొన్ని రైల్వే లైన్ల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాశ్మీర్ రాష్ట్రానికి కనెక్టివిటీ పెరుగుతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy