రైల్వే జీఎంతో తెలంగాణ ఎంపీలు భేటీ

vinodrailwayGMరైల్వే జీఎం వినోద్ కుమార్‌తో సికింద్రాబాద్ రైల్ నిలయంలో బుధవారం సమావేశమయ్యారు తెలంగాణ ఎంపీలు. ఈ సమావేశానికి టీఆర్ ఎస్ ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కే కేశవరావులతో పాటు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై చర్చించారు. కొత్త రైల్వే బడ్జట్ లో రాష్ట్రంలో చేపట్టబోయే కొత్త రైల్వే లైన్ల గురించి ప్రధానంగా ప్రస్తావించారు ఎంపీలు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy