రైల్వే బంపర్ ఆఫర్: జనరల్ బోగీల్లో ఏసీ

tain-acరైల్వే ప్రయాణీకులకు బంపర్ ఆఫర్. తక్కువ ధరకే ఏసీ ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది రైల్వే శాఖ. సాధారణ 3 టైర్‌ ఏసీ క్లాస్ కన్నా తక్కువ ధరకే ఈ సదుపాయం కల్పిస్తోంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎకానమీ బోగీలతో పూర్తి ఏసీ రైలును ఏర్పాటు చేయనుంది. రైల్లో మిగతా ఏసీ బోగీలతో పాటుగానే ఇవి కూడా ఉంటాయి. అయితే ఈ బోగీల్లో టెంపరేచర్ మరీ తక్కువ కాకుండా… 24 డిగ్రీ సెంటిగ్రేడ్‌లకు అటూఇటుగా ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందికి ఏసీ ప్రయాణ అవకాశాన్ని కల్పించేలా.. కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ఏసీ రైళ్లను ప్రవేశపెట్టే యోచన చేస్తున్నారు. ఈ మేరకు రైళ్లు, స్టేషన్లలో ఇప్పుడున్న వసతులను మరింత మెరుగుపరిచేందుకు రైల్వే ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy