రైల్వే బీమా:ఈ-టికెట్ పై రూపాయి చెల్లిస్తే ఇన్సూరెన్స్

రైల్వే శాఖ ఖర్చులు తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రయాణికుల దగ్గర నుంచి అదనంగా వసూళ్లు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగం గా 2016లో ‘ఫ్లెక్సీ ఫెయిర్‌ సిస్టం’ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రయాణికులకు పెద్దగా లాభం లేకపోయినా.. రైల్వేకు మాత్రం బాగానే ఆదాయం సమకూరుతోంది. తాజాగా ఈ-టికెట్‌ తీసుకునే ప్రయాణికులకు బీమాను ఆప్షన్‌ గా మార్చింది. ఇకపై ఆన్‌లైన్‌లో ఐఆర్‌ సీటీసీ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికులకు బీమా కావాలా? వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేసింది. టికెట్‌ కోసం వివరాలు సమర్పించే సమయంలో ఇన్సూరెన్స్‌ కూడా ఒక ఆప్షన్‌గా ఇస్తుంది. కావాల్సిన వారికి రూ.1 అదనంగా వసూలు చేస్తారు.
ఆన్‌లైన్‌ విధానంలో టికెట్‌ బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు 2017 డిసెంబర్‌ నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఈ విధానం ఈ నెల 2 వరకు కొనసాగింది. దాదాపు 9 నెలల పాటు ప్రయాణికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించింది. ఖర్చులు పెరిగిపోవడంతో ఇటీవల ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తెచ్చింది. స్లీపర్, ఏసీ, చెయిర్‌ కార్‌ సీట్ల కోసం టికెట్లు బుక్‌ చేసే ప్రయాణికులు బీమా కావాలా వద్దా? అన్నది ఇకపై వారికే వదిలేసింది. దీని కోసం ICICI, సుందరం, శ్రీరామ్‌ ఫైనాన్స్‌లాంటి సంస్థలతో రైల్వే శాఖ అగ్రిమెంట్ చేసుకుంది. బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే.. రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది.

ఈ-టికెట్‌పై బీమాను ఆప్షన్‌గా చేయడంపై ప్రయాణికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రయాణికుడి సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రైవేటు బీమా సంస్థలకు అప్పగించడం సరికాదని అభిప్రాయపడుతున్నా రు. అదనంగా బీమా వసూలు చేయడమేంటని ప్ర శ్నిస్తున్నారు. ప్రభుత్వ కంపెనీలకు కాకుండా ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు.

బీమా విషయంలో సాధారణ టికెట్‌ ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రయాణికులకు ఏదైనా జరిగితే వారికి నష్ట పరిహారం రైల్వే శాఖ చెల్లిస్తుందని చెబుతున్నారు. ఈ-టికెట్‌/ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే వారికి ఈ బీమా అదనం అంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy