రైల్వే స్టేషన్లలో రజనీకాంత్ వాయిస్

images (2)ఇకనుండి రైల్వే స్టేషన్లలో రజనీకాంత్ వాయిస్ వినబోతున్నాం. ఈ మధ్య రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి . ప్లాట్ ఫాంలు మారడానికి పట్టాలు దాటవద్దని, బ్రిడ్జ్ లనే ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ ఎన్ని ప్రకటనలు చేస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఇటువంటి ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు రజనీకాంత్ వాయిస్ ఉపయోగించాలని తమిళనాడు లోని ఎగ్మోర్ రైల్వే డిపార్టుమెంట్ నిర్ణయించింది. ఈయన వాయిస్ వినిపించడం ద్వారా రైలు పట్టాలు దాటకుండా ప్రజల్లో చైతన్యం తీసుకు రావొచ్చని ఎగ్మోర్ రైల్వే పోలీసులు భావిస్తున్నారు. దీని కోసం రైల్వే పోలీస్ డిపార్టుమెంటులో పని చేసే మిమిక్రి ఆర్టిస్టుతో రజనీకాంత్ వాయిస్ రికార్డు చేసి అన్ని రైల్వే స్టేషన్లలో వేయనున్నారు. పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువగా స్కూలు, కాలేజీ విద్యార్థుల ఉండటం…యూత్ లో రజినీకి ఉన్న క్రేజ్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచి పనికి తన వాయిస్ ఉపయోగిస్తుండటంతో రజనీకాంత్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy