రొంబ రాజకీయం : శశికళ బహిష్కరణ

sasikalaతమిళనాడులో మరోసారి రాజకీయ ప్రకంపనలు. అన్నాడీఎంకేలోని పళని, పన్నీర్ వర్గాలు ఒక్కటైన మరుక్షణమే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పార్టీలో చిన్నమ్మ శశికళపై వేటు వేశారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. రెండు వర్గాల విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ కార్యాలయంలోనే భేటీ అయిన పళని స్వామి, పన్నీర్ సెల్వం.. శశికళ బహిష్కరణపై ప్రకటన చేశారు. పార్టీలో అంతా సర్దుమణిగిందని.. ఇక నుంచి అమ్మ ఆశయాల కోసమే పని చేస్తామని ప్రకటించారు. మేం ఓ తల్లి బిడ్డలమే అని.. ఎవరూ విడగొట్టలేరని తెలిపారు. అమ్మ ఆత్మ కోరిక మేరకే విలీనం జరిగిందని లేఖ విడుదల చేశారు.

డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం

రెండు వర్గాలు విలీనం అయిన మరుక్షణమే పన్నీర్ సెల్వం వర్గానికి మంత్రుల పదవుల కేటాయింపు జరిగిపోయింది. పన్నీర్ సెల్వంకు ఆర్థిక శాఖ బాధ్యతతో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. మరో ఎమ్మెల్యే పాండ్యరాజన్ కు సాంస్కృతిక శాఖ కేటాయించారు. యు.రాధాకృష్ణన్ కు పశు సంవర్ధక శాఖ, బాలకృష్ణారెడ్డికి స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్పేర్ శాఖ, సీవీ షణ్ముగం న్యాయ, జైళ్ల శాఖతోపాటు మైనింగ్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తారని ప్రకటన విడుదల చేశారు. కొత్తగా మంత్రి పదవుల చేపట్టబోతున్న వీరితో రాజ్ భవన్ లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.

సమన్వయం కోసం కమిటీ :

అన్నాడీఎంకే పార్టీ కన్వీనర్ గా పన్నీర్ సెల్వంని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy