రోగాలతో అల్లాడుతున్న లోకం..!!

IN09_FEVERS_103082fఆరోగ్యమే మహాబలం.. కానీ ఇప్పుడు ప్రజలకు ఈ బలమే లేకుండా పోతోంది. మారుతున్న జీవనవిధానంతో పాటు కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. పోటీ ప్రపంచంలో తీవ్ర ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం, పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు మొత్తంగా అనారోగ్యానికి దారితీస్తున్నాయి. లేని పోని రోగాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నూటికి 95 శాతం మంది ఒత్తిడితోనే రోగాలపాలవుతున్నారు. ఏ ఇంటిలో చూసినా ఇద్దరు ముగ్గురు పేషెంట్లు కనిపిస్తుంటారు. సంపాదించే ఆదాయంలో 60 శాతానికిపైగా మెడిసిన్స్ కోసమే ఖర్చు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ పేరుతో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 1990 నుంచి 2013 మధ్య కాలంలో ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసిన ఈ సంస్థ… ప్రపంచ జనాభాలో ఏకంగా 95 శాతం మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేల్చింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు ప్రతి 20 మందిలో ఒకరు మాత్రమే ఉన్నారని సర్వేలో వెల్లడైంది. 1990 నుంచి 2013 మధ్యకాలంలో అనారోగ్యం బారినపడిన వారిసంఖ్య ఏకంగా 52 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy