రోగాలు ‘స్మార్ట్’ గా వస్తున్నాయ్ జాగ్రత్త..!

Disease-smartphoneఇప్పుడంతా స్మార్ట్ యుగం. మొబైల్, ట్యాబ్, ల్యాప్ ట్యాప్… ఏదైనా సరే… స్మార్ట్ నే ప్రిఫర్ చేస్తున్నారు యూత్.  కానీ దానికి బానిసలైతే డేంజరంటున్నారు డాక్టర్లు. అవి వాడితో స్మార్ట్ రోగాలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.

 

 

 

 

 

ఐఫోశ్చర్ వ్యాధి ఖాయం

కొత్తగా స్మార్ట్  గాడ్జెట్ ఏదొచ్చినా యూత్ వెంటనే కొనేస్తున్నారు.  మొబైల్, టాబ్లెట్, ఫ్యాబ్లెట్ లాంటి వాటిని పర్చేజ్ చేయగానే …  వందల కొద్దీ యాప్స్ లోడ్ చేసుకుంటున్నారు. ఫీచర్స్ కోసం తెగ వెతుకుతున్నారు.  ఆప్ డౌన్ లోడ్ కాగానే… దాన్ని యూజ్ చేస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ గాడ్జెట్స్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిదని అంటున్నారు డాక్టర్లు. ఇవి ఎక్కువగా వాడటం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ వినని… ఐ పోశ్చర్, బ్లాక్ బెర్రీ థమ్స్, వి-ఇటీస్, స్క్రీన్ సైటెడ్ నెస్ లాంటి సమస్యలు రావడం ఖాయమంటున్నారు.

రోజులో 150సార్లు చెకింగ్

cell vires1కొత్తగా వచ్చే ఈ సమస్యలన్నీ స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ వల్లే నట. చాలామంది మెస్సేజ్ లు వచ్చినా రాకున్నా… చీటికీ మాటికీ ఫోన్ పరిశీలించడం బాగా అలవాటైంది. ఒక్కొక్కరు రోజులో వంద నుంచి 150 సార్లు ఫోన్  ఓపెన్ చేస్తున్నారనీ… ఇది డేంజరేనంటున్నారు. అలాగే కొందరు గేమ్స్ ఆడుతున్నప్పుడు… రక రకాలుగా వంకర్లు తిరిగిపోతుంటారు.  దీనివల్ల కండరాల మీద శ్రమ ఎక్కువగా పడుతోంది.  దాంతో వెన్నుముక, మెడ, కీళ్ళ మీద ప్రభావం చూపించి నొప్పులు మొదలవుతాయి. యూత్ లోనే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తోంది.  దీన్నే ఐ పోశ్చర్ అంటారు.

 

 

తలకాయ, భుజాల నొప్పులు

కొందరు వంచిన తల ఎత్తకుండా ఫోన్ ఆపరేట్ చేస్తుంటారు. దాని వల్ల మెడ, భుజాల నొప్పులు వస్తుంటాయి.  ఎక్కువగా టెక్ట్స్ మెస్సేజ్ లు, ఈ మెయిల్స్, ట్వీటింగ్ చేసే వాళ్ళల్లో టెక్ట్స్ నెక్ అనే ఈ సమస్య వస్తుంది.  రోజులో ఎక్కువ టైమ్ మెడని వంచి ఉంచడం వల్ల… మెడలోని టిష్యూలపైనా తీవ్ర ఒత్తిడి కలుగుతుంది.  వీటికి తోడు కళ్ళు ఎర్రబడటం, తలనొప్పి,  మెడ, వెన్నుముక నొప్పి, రిస్ట్ నొప్పులు కూడా సెల్ ఫోన్స్ వాడే వాళ్ళల్లో వస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కంప్యూటర్లు ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళల్లో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ రావడం ఖాయమంటున్నారు ఎక్స్ పర్ట్స్.

తలకింద పెట్టుకోవద్దు

cell vires2సో… ఇప్పటికైనా స్మార్ట్ గాడ్జెట్స్ ను ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. గంటల కొద్దీ మెస్సేజ్ లు పంపడం కూడా మానుకోవాలి.  ఈమెయిల్స్, ఫేస్ బుక్ పోస్ట్స్, సోషల్ మీడియా ట్వీట్స్ అబ్జర్వ్ చేయడం తగ్గించాలి.  గేమ్స్ స్మార్ట్ ఫోన్ నుంచి ఇమీడియట్ గా తీసేయండి. రాత్రి పూట నిద్ర పోయే ముందు ..ఫోన్ ని తలకింద పెట్టుకునే అలవాటు కూడా మానుకోవాలి.  దాన్ని సాధ్యమైనంత దూరంగా ఉంచాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy