రోజాకు గాయాలు…నిమ్స్ కు తరలింపు

AoPwjzIo4FRcGclCpblU4RQYlT6u4jKeP4APxMwDSvQwఅసెంబ్లీ ఆవరణలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఆమె గాయపడ్డారు. పోలీసులు రోజాను అదుపులోకి తీసుకుంటుండగా ఆమె కిందపడిపోయారు. ఇవాళ  ఉదయం అసెంబ్లీకి వచ్చిన రోజాను గేటు వద్ద మార్షల్స్ అడ్డుకున్నారు. రోజా అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు మార్షల్స్ నిరాకరించారు. దీంతో వైసీసీ ఎమ్మెల్యేలు మార్షల్స్ తో గొడవకు దిగారు. తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని రోజాను బలవంతంగా అసెంబ్లీ ఆవరణం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. తర్వాత  పోలీసులు రోజాను నాంపల్లి పీఎస్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తీస్కెళ్లే లోపే ఆమె సొమ్మసిల్లిపోయారు. దీంతో వైద్య పరీక్షల కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో  ఉండగానే రోజాను ఆపార్టీ అధినేత జగన్ పరామర్శించారు.

vlcsnap-2015-12-19-11h09m47s190ఏపీ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రోజాపై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రోజాపై సస్పెన్షన్ ఎత్తేయకుంటే సభను జరగనివ్వమన్నారు. రూల్స్ కు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకున్నారని ఫైరయ్యారు. జగన్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు యనమల. సభ అధికారాలకు వ్యతిరేకంగా మాట్లాడితే జగన్ పై కూడా సస్పెన్షన్ వేటేస్తామన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy