రోడ్డు ప్రమాదంలో ఏడుగురు టెకీలు మృతి

ahmed nagar accidentఅహ్మద్ నగర్ లో స్నేహితుని వివాహానికి హాజరయ్యి తిరుగు ప్రయాణంలో ఉన్న ఏడుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం(జులై 2) పూణే-అహ్మద్‌ నగర్‌ హైవేపై మిని బస్సును ట్యాంకర్ ఢీ కొట్టడంతో అందులో ఉన్న 13 మందిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఈ సంఘటన ఫూణేకు నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనికండ్‌ గ్రామం సమీపంలో చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. చిన్న వయస్సు గల ట్యాంకర్‌ డ్రైవర్‌ కృష్ణ కితర్వాడ్‌ (22) నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని.. సోమవారం (జులై 3) ఉదయం అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy