రోడ్డు ప్రమాదంలో V6 రిపోర్టర్ ప్రసన్నకుమార్ మృతి

v6సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ డి.ప్రసన్నకుమార్ ఆకస్మికంగా చనిపోయారు. సిద్దిపేట జిల్లా జాతీయ రహదారిపై కోడకండ్ల గ్రామ శివార్లలో ఆయన ప్రయాణిస్తున్న కారు (AP 23R 1958) డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నకుమార్ స్పాట్ లోనే చనిపోయారు. ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గానూ బాధ్యతలు నిర్వహించారు.

తమ్ముడి వివాహానికి పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. ప్రసన్న స్వగ్రామం గోదావరిఖని. ప్రసన్న మృతిపట్ల వీ6 యాజమాన్యం, సిబ్బంది సంతాపం తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy