రోడ్లపై విమానాలు : ఆగ్రా హైవేపై జెట్ ఫైటర్స్

warభారత వాయుసేనకు చెందిన 16 యుద్ధ విమానాలు ఇవాళ లఖ్‌నవూ-ఆగ్రా హైవేపై ల్యాండ్‌ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు 65 కిలోమీటర్ల దూరంలోని ఉన్నాం జిల్లా బంగార్‌మౌ వద్ద అద్భుత విన్యాసాలను చేపట్టింది. ఐఏఎఫ్ డ్రిల్స్‌లో భాగంగా ఈ విన్యాసాలను చేపడుతున్నారు. దేశంలోనే లఖ్‌నవూ-ఆగ్రా లేన్ హైవే అత్యంత పొడువైనది. ఇది 302 కిలోమీటర్ల పొడువు ఉంటుంది.  ఈ మార్గంలో రాకపోకలను నిషేధించారు.విన్యాసాల్లో పాల్గొన్న వాటిలో 35టన్నుల సి-130 సూపర్‌ హెర్క్యులెస్‌ విమానం కూడా ఉంది. గరుడ్‌ కమాండోలను సంక్షోభ ప్రాంతాలకు తరలించే విన్యాసాల్లో భాగంగా ఈ భారీ విమానం ల్యాండ్‌ అయ్యింది. మరో 15 ఫైటర్‌ జెట్‌లు ఇక్కడ ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. దాదాపు 3 గంటల పాటు ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. నిమిషాల వ్యవధిలోనే యుద్ధవిమానాలు ఇక్కడ ల్యాండ్‌ అయిన తర్వాత మళ్లీ గాల్లోకి ఎగురుతున్నాయి. అత్యవసర సమయాల్లో విమానాశ్రయాలపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ విన్యాసాలు చేస్తున్నారు.

.. ఒక్కోటి రూ.900 కోట్లు విలువచేసే సీ-130 విమానం 200 మంది గరుడ్‌ కమాండోలను తరలించగలదు. వీటిని  2010లో ప్రభుత్వం కొనుగోలు చేసింది.

.. 2015లో చేపట్టిన యుద్ధ విన్యాసాల్లో భాగంగా మిరేజ్‌ 2000 యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్‌ అయ్యింది. తర్వాత సుఖోయ్‌ -30 విమానాలు కూడా ల్యాండ్‌ అయ్యాయి.

.. గత ఏడాది కూడా సుఖోయ్‌ 30 యుద్ధ విమానం లఖ్‌నవూ- ఆగ్రా హైవేపై ల్యాండ్‌ అయ్యింది. ఐఏఎఫ్‌లో ఈ యుద్ధవిమానాలు అత్యంత కీలకమైనవి.

.. దేశవ్యాప్తంగా దాదాపు 12 జాతీయ రహదారులను యుద్ధవిమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy