రోడ్లపై స్పెషల్ డ్రైవ్: ఎప్పుడైనా తాగు.. అప్పుడే పట్టుకుంటారు

drunk-drivningమందుబాబుల ఆటకట్టించేందుకు రెడీ అయ్యారు పోలీసులు. ఇక రోజంతా డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహించాలని నిర్ణయించింది రాచకొండ పోలీస్ కమిషనరేట్. ఇంతకు ముందు శుక్ర, శనివారాలకే పరిమితమైన డ్రంకెన్ డ్రైవ్ లను ఇక పై రోజూ… 24/7 నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాచకొండ లోని మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, భువనగిరి జోన్‌లలో డైనమిక్‌ డ్రంకెన్‌ డ్రైవ్‌ను అమలు చేయనున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను తనిఖీ చేయనున్నారు. ప్రత్యేక తనిఖీలతో కొంత మేర రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని భావిస్తున్నారు అధికారులు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై రోడ్డు ప్రమా దాలు జరగుతుండటంతో అక్కడ కూడా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలకు పూర్తి స్థాయిలో శ్రీకారం చుడుతున్నారు. టోల్‌ప్లాజా ర్యాంపుల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లే అవకాశం ఉండటంతో అక్కడ సమయంతో నిమిత్తం లేకుండా తనిఖీలు చేయనున్నారు. హెచ్‌ఎండీఏ సమకూర్చిన 12 బ్రీత్‌ అనలైజర్లను ఉపయోగించి మందుబాబుల ఆగడాలకు కళ్లెం వేస్తామని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. రాచకొండలో డైనమిక్‌ డ్రంకెన్‌ డ్రైవ్‌ను పటిష్టంగా అమలు చేస్తామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy