రోడ్లు క్లీన్ చేసిన సచిన్..!

sachinస్వచ్ఛ భారత్ ప్రోగ్రాం లో పాల్గొనాలని పీఎం నరేంద్ర మోడీ 9 మంది ప్రముఖులను కోరారు. మీరు కూడా నాలాగే మరో 9 మందిని కోరండని కూడా మోడీ సూచించారు. అలా పిలుపునందుకున్న 9 మందిలో క్రికెట్ స్టార్, రాజ్యసభ మెంబర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. మోడీ పిలుపుకు సచిన్ సై అన్నాడు. తెల్లవారుజామునే 4 గంటలకు ఫ్రెండ్స్ తో కలిసి ముంబై రోడ్లు క్లీన్ చేశాడు. అంతేకాకుండా, క్లీన్ చేస్తున్న ఫోటోలను తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు. ఈ ఫోటోలకు చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇండియా మొత్తం పరిశుభ్రం అయ్యే వరకు నిద్రపోనని, స్వచ్ఛ భారత్ తనను ఇన్స్ పైర్ చేసిందని, ఈ ఉద్యమం కొనసాగిస్తానని చెప్పాడు సచిన్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy