రోబోలతో డ్రైనేజీల క్లీనింగ్

jalamandalహైదరాబాద్ నగరంలో మురుగునీటి వ్యవస్ధను సమర్ధంగా నిర్వహించేందుకు జలమండలి ప్రణాళికలు రూపొందంచింది. మురుగునీటి వ్యవస్ధ 50 ఏళ్ల  క్రితం ఏర్పాటు చేసింది కావటంతో అనేక ప్రాంతాల్లోఇబ్బందులు తలెత్తున్నాయి. కొత్త మురుగు నీటి వ్యవస్ధను ఏర్పాటు చేసేందుకు 5 వేల కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అనేక చోట్ల తాగునీటి పైపులైన్లు కూడా లీకేజి అయి రోడ్లపైకి నీళ్లు వచ్చేస్తున్నాయి.  ఈ రెండు వ్యవస్ధలు గాడిలో పెట్టేందుకు రెడీ అయ్యింది జలమండలి.

మ్యాన్ హోల్స్  దగ్గర సెన్సర్ల వినియోగం ,మురుగుకాల్వల్లోని చెత్తను తొలగించుటకు  రోబోలను  నగరంలో దించేందుకు జలమండలి ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ లోని కలుషిత నీటి కాల్వలను, తాగునీటి పైపులైన్లను 1176 భాగాలుగా విభజించి వాటి సమస్యలను” ఎ.బి.సి,డి “లుగా వర్గీకరిస్తారు. “ఎ.బి” కేటగిరీ సమస్యలను స్ధానికంగానే అధికారులు పరిష్కరించుకునే విధంగా అధికారాలను ఇస్తారు.” సి ” కేటగిరీ సమస్య 20 లక్షలు వ్యం చేయాల్సి ఉంటే  ఎండీ నిర్ణయిస్తారు. ” డి” కేటగిరీ సమస్యలుంటే వాటిని మురుగునీటి  ప్రణాలికలో భాగంగా పరిష్కరిస్తారు. 1176 భాగాల్లో మాన్ హోల్స్ ఎక్కడెక్కడున్నాయో  మ్యాపింగ్ చేసి వాటిని జీపియస్ తో అనుసంధానం చేయనున్నారు. ఈ మొత్తం వ్యవస్ధను జలమండలి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేస్తారు.  దీంతో మ్యాన్ హోల్స్ దగ్గర కలుషిత నీరు సగం పెరగ్గానే  సెన్సర్ హెచ్చరిక జీపిీయస్ ద్వారా కమాండ్ కంట్రోల్ కి చేరుతుంది. దీంతో ఎక్కడ మురుగు పొంగే అవకాశం ఉందో తెలుసుకొని సిబ్బంది అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. మ్యాన్ హోల్స్ లో ఉన్న పూడికను తొలగించుటకు వీలుగా కొన్ని ప్రత్యేక రోబోలను తయారు చేస్తున్నారు. ఇదే విధంగా చెత్తను డ్రైనేజీలలోని చెత్తను తీయటానికి సరికొత్త వాహనాన్ని కొనుగోలు చేయనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy