రోబో జర్నలిస్ట్ : రోజుకు వెయ్యి వార్తలు రాసేస్తాడు

robo-journalistఒక్క నెలలో ఐదుగురు పాత్రికేయులు 30,000 వార్తాకథనాలను రాయడం సాధ్యం కాదు. అయితే రోబో జర్నలిస్టుల ద్వారా ఇది సాధ్యమవుతుందంటా..! యునైటెడ్‌ కింగ్‌డమ్, ఐర్లాండ్‌లలో ప్రఖ్యాతిగాంచిన ‘ప్రెస్‌ అసోసియేషన్‌ (పీఏ)’ వార్తాసంస్థ ఈ పనికి శ్రీకారం చుట్టింది. ఐదుగురు రోబో రిపోర్టర్ల సాయంతో ఒక్క నెలలోనే ఆ వార్త సంస్థ 30,000 వార్తాకథనాలను రాయించిందటా..!

రోబో రిపోర్టర్లు స్థానిక ప్రభుత్వ సంస్థల వద్ద ఉండే సమాచారాన్ని క్రోడీకరించి ఆ సమాచారాన్ని ప్రచురణకు అనుగుణంగా వార్తలుగా, గ్రాఫ్స్‌గా మారుస్తాయి. ‘రిపోర్టర్స్‌ అండ్‌ డాటా అండ్‌ రోబోట్స్‌(రాడార్‌)’గా పిలిచే ఈ ప్రాజెక్టు కోసం పీఏ సంస్థ ‘ఉర్బ్స్‌ మీడియా’తో చేతులు కలిపింది. డిజిటల్‌ పాత్రికేయ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ అందిస్తున్న రూ.5. 17కోట్ల గ్రాంటు ను సైతం ఈ ప్రాజెక్టు గెలుచుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేసింది ఆ వార్త సంస్థ.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy