
రజినీ రాజకీయ ఆగమనం ఖాయమని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తన పుట్టినరోజు అయిన డిసెంబర్ 12న ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశముందని అంటున్నారు. డిసెంబర్ వరకు రోబో సినిమా విడుదల అవుతుంది. అత్యంత భారీ బడ్జెట్తో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తర్వాత గ్రాండ్ రాజకీయ పార్టీని ప్రకటించాలని రజినీ భావిస్తున్నారని… అందుకే ఈ ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.