రోహిత్ శబ్దం ప్రారంభం

NARA ROHITHవెరైటీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నారా రోహిత్ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. మంజూ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఆదివారం (మార్చి-18)న లాంచ్ చేశారు. ఈ సినిమాకు శబ్దం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అమరావతిలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టారు. శ్రీవైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ మూవీలో రోహిత్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది సినిమా యూనిట్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy