రోహిత్ సూసైడ్ పై విద్యార్థుల ఆందోళన

HCA 2PhD స్కాలర్ రోహిత్ ఆత్మహత్యతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు. దీంతో వర్సిటీలో భారీగా మోహరించిన పోలీసులు..ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. పదిన్నర తర్వాత పోస్టుమార్టం జరగనుంది.

మరోవైపు డెడ్ బాడీని తరలించే సమయంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే  రోహిత్ కు న్యాయం జరిగే వరకూ ఆందోళన ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. రోహిత్ మరణానికి కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపు నిచ్చాయి విద్యార్థి సంఘాలు.

డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించిన తర్వాత కూడా వర్సిటీలో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి వర్సిటీ ఆడ్మినిస్టేషన్ బిల్డింగ్ దగ్గర ఆందోళనకు దిగారు తోటి విద్యార్తులు.  రోహిత్ ఆత్మహత్యపై వీసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఘటన మొత్తంపై సమగ్ర విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy