లంకతో పోరు.. మూడో రోజూ అదే జోరు

team-indiaమూడో టెస్ట్‌ మూడో రోజులోనూ భారత బౌలర్లు సత్తా చాటారు. వరుసగా వికెట్లు కోల్పోతోంది లంక. 19/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 24 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో కేవలం 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. కరుణరత్నె(16), తరంగ(7), పుష్పకుమార్‌(1), మెండిస్‌(12) వరుసగా పెవిలియన్ చేరారు. షమి 2, అశ్విన్‌ 1, ఉమేష్‌ యాదవ్‌ 1 వికెట్‌ తీశారు. ఇన్నింగ్స్‌ పరాజయం తప్పించుకోవాలంటే శ్రీలంక ఇంకా 311 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో చండీమాల్, దినేశ్ ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy