లంకతో వన్డే పోరుకు టీమిండియా సై

virat-and-dhoni-twitter_806x605_41503117439శ్రీలంక పర్యటనలో మంచి ఊపు మీదున్న టీమిండియా  ఆదివారం(ఆగస్టు-20) ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతోంది. టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఉత్సాహం మీదున్న టీమిండియా.. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ను సైతం ఉడ్చేయాలని భావిస్తోంది. అయితే నిజానికి ఇది వన్డే సిరీస్‌లానే కనిపిస్తున్నా దీనివెనక BCCI పెద్ద వ్యూహమే రచించినట్టు తెలుస్తోంది. తుదిజట్టు కూర్పు అందులో భాగమేనని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌కు ముందస్తు సన్నాహక సిరీస్‌గా BCCI దీనిని భావిస్తున్నట్టు సమాచారం. ఇక అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన దంబుల్లాలోనే కోహ్లీ ఆదివారం లంకతో పోరుకు సిద్ధమవుతున్నాడు. దంబుల్లాలో 19 వన్డేలు ఆడిన భారత్ తొమ్మిదింటిలో విజయం సాధించింది. శ్రీలంక 11 వన్డేలు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది. అయితే ఆతిథ్య జట్టును తక్కువగా తీసుకుంటే ప్రమాదమే. ఎందుకంటే ఇటీవల ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ సేన నిర్దేశించిన 320 పరుగుల విజయ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా ఛేదించింది. అయితే లంకేయులు ఎప్పుడు ఎలా ఆడతారన్నది మాత్రం సస్పెన్సే. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-3తో కోల్పోయింది.

కోహ్లీ సేనను ఓడించడం కష్టమే!

భారత్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్నది అన్నాడు ఆస్ట్రేలియా మాజీ సారథి మైకెల్‌  క్లార్క్‌. ‘భారత క్రికెట్‌ జట్టు సారథి కోహ్లీ వ్యూహాన్ని గమనిస్తే.. అతను టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ రెండు వరుస టెస్టు మ్యాచ్‌లకు ఒకే జట్టును ఎంచుకోలేదు. వెస్టిండీస్‌, శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించి విజయాలు దక్కించుకున్నాడు. గత రెండేళ్లుగా నేను క్రికెట్‌ దూరంగా ఉన్నాను. ప్రస్తుత భారత జట్టుపై నేను ఆడలేదు. కోహ్లీ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. తన విజయపరంపరను ఇలాగే కొనసాగిస్తే ప్రపంచంలోనే టీమిండియా నంబర్‌ వన్‌ టీమ్‌గా నిలవడం ఖాయం’ అని తెలిపాడు క్లార్క్‌.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy