లంక-8/2 : విజయం దిశగా టీమిండియా

 

lanka2wickసోమవారం(నవంబర్-20) కోల్‌కతాలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో విజయంపై కన్నేసింది టీమిండియా. మరొక్క సెషన్ మాత్రమే మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో 8 వికెట్లు తీస్తే కోహ్లి సేన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది.

231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. టీ సమయానికి 2 వికెట్లు నష్టపోయి 8 పరుగులు చేసింది. భువనేశ్వర్, షమి చెరొక వికెట్ తీశారు. ఓపెనర్లు సమరవిక్రమ డకౌట్ కాగా.. కరుణరత్నె 1 పరుగు చేసి ఔటయ్యాడు. మాథ్యూస్ (5), తిరిమానె (2) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులు చేసి.. మ్యాచ్‌లో మూడు రోజులు వెనుకబడి ఇప్పుడీ స్థితిలో నిలవడం నిజంగా అద్భుతమే. ఈ మ్యాచ్‌లో ఇంకా 40 ఓవర్ల ఆట మిగిలుంది. అంతకుముందు కెప్టెన్ కోహ్లి సెంచరీ చేయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 352 పరుగుల దగ్గర డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy