లండన్‌ నైట్‌క్లబ్‌లో యాసిడ్‌ దాడి 

landanయూకే రాజధాని బ్రిటన్ రాజ‌ధాని మ‌రోసారి ఉలిక్కి ప‌డింది. నైట్‌క్ల‌బ్‌లో జ‌రిగిన యాసిడ్ దాడిలో 12 మంది గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈస్ట్ లండ‌న్‌లోని  మాన్‌గ్లే నైట్‌క్లబ్‌లో సోమ‌వారం ఈ దాడి జ‌రిగింద‌ని లండ‌న్ ఫైర్ బ్రిగేడ్ అధికార ప్ర‌తినిధి తెలిపారు. దాడి జరిగే సమయంలో క్లబ్‌లో దాదాపు 600 మంది ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 12మంది గాయపడినట్లు సమాచారం. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులకు ఎటువంటి ప్రాణహానీ లేదని డాక్టర్లు చెబుతున్నారు అర్ధ‌రాత్రి 12.10 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు సమాచారం అందుకున్న పోలీసులు…వెంట‌నే రంగంలోకి దిగిన ఆ ప్రాంతాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకొని విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రినీ అరెస్ట్ చేయ‌లేదు.

ఈ మ‌ధ్య‌కాలంలో లండ‌న్‌లో యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. 2010 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 1800కుపైగా యాసిడ్ దాడులు  జరిగాయి. ఒక్క 2016లో 454 నేరాల్లో యాసిడ్ వాడిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy