లండన్ కోర్టు వ్యాఖ్యలు : తప్పు బ్యాంకులు చేసి.. మాల్యాను అంటారా

MALYAభారతీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్ లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే కేసుపై శుక్రవారం (మార్చి16) లండన్‌లోని వెస్ట్‌ మిన్‌స్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు విజయ్ మాల్యా హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా మాల్యా అప్పుల ఎగవేతకు సంబంధించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు వెస్ట్‌ మిన్‌స్టర్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎమ్మా ఆర్బుత్నాట్.

మాల్యాకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులే నిబంధనలను ఉల్లంఘించాయని జడ్జి ఎమ్మా ఆర్బుత్నాట్ అన్నారు. పార్టు, పార్టులుగా ఉన్న ఈ కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తుందని.. ఇప్పుడిప్పుడే ఈ కేసు అర్థమవుతోందని జడ్జి వ్యాఖ్యానించారు. భారతీయ బ్యాంకులు తమ నిబంధనలను ఉల్లంఘించాయన్న విషయం తనకు ఇప్పుడే తెలుస్తోందన్నారు. దీనిపై భారతీయ బ్యాంకులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మాల్యాపై కుట్ర జరుగుతుందన్న కోణం అందులో ఉన్నట్లు ఆమె తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy