లక్కీబాయ్ : ఇరుకున్నా.. బతికేసాడు

finger-stuck-in-train-door-chinaట్రైన్ వెళ్లిపోతుందన్న టెన్షన్.. టైమ్ కి చేరుకోలేనన్న కంగారు.. ఫ్లాట్ ఫామ్ మీద ఏ ట్రైన్ బయలుదేరినా మనదేనేమో అనే భయంతో మరో ట్రైన్ ఎక్కేస్తారు చాలా మంది. ఇలా ఎక్కేసి చేతి వేళ్ళను డోర్ లో ఇరిక్కిచుకున్నాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. అక్కడ అన్నీ ఎలక్ట్రానిక్ ట్రైన్ లే ఉండటంతో అందులో డోర్లు బండి స్టార్ట్ అవ్వగానే ఆటోమాటిక్ గా మూసుకుపోతాయి. అనుకోకుండా వేరే ట్రైన్ ఎక్కేసిన ఈ వ్యక్తి దిగేసేలోపే చేతివేళ్ళు డోర్ లో ఇరుక్కుపోయాయి. అతను ఫ్లాట్ ఫామ్ మీద పరిగెడుతూ ఎలాగోలా తంటాలు పడి ఏ గాయం లేకుండా ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.. అది బయటపడి నెట్ లో వైరల్ గా మారింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy