లక్కీ నంబర్లదే హవా : RTAకు ఒక్కరోజే 30 లక్షల ఆదాయం

Nizamabad-First-Vehicle-With-Telangana-Registration-Numberఫ్యాన్సీ  నంబర్స్ అంటే  చాలా మంది ఇష్టపడతారు. కొందరైతే  ఏకంగా వెహికల్ కంటే ఎక్కువ  డబ్బు చెల్లించి మరీ నచ్చిన నెంబర్ ను  సొంతం చేసుకుంటారు. బర్త్ డే, మ్యారేజ్ డే  ..లక్కీ నంబర్  ..ఇలా ఇష్టపడి నంబర్ ను తీసుకుంటారు. వెహికిల్  కొనడం  ఒక్కెతైయితే…ఫ్యాన్సీ నెంబర్  తీసుకోవడం మరో ఎత్తైంది. దీంతో ఖైరతాబాద్  రవాణా శాఖ  కార్యాలయంకు  సోమవారం(అక్టోబర్-16)  ఒక్క రోజే  30 లక్షల ఆదాయం వచ్చింది. ఎంతరేటు పెట్టి వెహికిల్ కొన్నామన్నది ముఖ్యం కాదు…దాని మీద ఎట్లాంటి ఫ్యాన్సి నెంబర్ ఉందన్నదే ప్రస్తుతం ప్రెస్టేజ్ ఇష్యూ. అందుకే చాలా మంది వెహికిల్ కు ఎంత ఖర్చు అయ్యిందో అన్నిడబ్బులు పోయినా పర్వాలేదు.. నచ్చిన నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు.

TS09 EW 0001 అనే నెంబర్ ను 7 లక్షల 56 వేల 695 రూపాయాలకు సొంతం చేసుకున్నారు మున్నా లిమిటెడ్ కు చెందిన వ్యాపారి. ఇక  TS09 EW 0009, మెగా ఇంజనీరింగ్ కంపెనీ 4 లక్షల 70 వేలకు ఓన్ చేసుకుందని అధికారులు తెలిపారు. ఇలా సోమవారం ఒక్క రోజే ఖైరతాబాద్ ఆర్టీఏలో 30 లక్షల ఆదాయం వచ్చింది. 1.9.999.9999 నెంబర్లకు 50 వేలు, 3333.1111.1116.6666.8888 నెంబర్లకు 30 వేలు, 786.4455.3366. నెంబర్లకు 20 వేలు, 9009.9099 నెంబర్లకు పది వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలోనే ఈ ఫ్యాన్సీ నెంబర్ల పోటీ మరీ ఎక్కువగా ఉందని చెబుతున్నారు అధికారులు

ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ ఇలా ఉంది

TS09 EW 0001 రూ. 7 లక్షల 56 వేల 695

TS09 EW 0009 రూ. 4 లక్షల 70 వేలు

ఖైరతాబాద్ రవాణాశాఖకు రూ. 30 లక్షల ఆదాయం

1..9.999.9999 నెంబర్లకు రూ. 50 వేలు

3333.1111.1116.6666.8888- రూ. 30 వేలు

786.4455.3366 నెంబర్లకు 20 వేలు

9009.9099 నెంబర్లకు పది వేలు

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy