లక్షణంగా పెళ్లి : కల్యాణ లక్ష్మి సాయం రూ.లక్షకి పెంపు

kcr-kalyana-laxmiపేదల ఇంట్లో ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని పెంచింది ప్రభుత్వం. ఆ మేరకు అసెంబ్లీలో స్వయంగా ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ఒక నుంచి ఒక లక్ష 116 ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 75వేల 116 ఇస్తున్నారు. కొత్తగా రూ.25వేలు పెంచి.. లక్షా 116 రూపాయలు అందించనున్నారు. పెరిగిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి అందజేయనున్నారు.

ఇప్పటి వరకు ఈ పథకం కింద 3లక్సల 65వేల మంది మహిళలకు సాయం అందించినట్లు వెల్లడించారు సీఎం. వ్యక్తిగతంగా నా మనసుకి ఎంతో దగ్గరైన పథకం అన్నారు. మొదట్లో కొన్ని వర్గాలకి మాత్రమే ఈ పథకం అమలు చేశారు. ఆ తర్వాత బీసీలకు కూడా వర్తింపజేశారు. ఇప్పుడు అన్ని వర్గాల్లోని పేదలకు కల్యాణలక్ష్మి అమలు అయ్యే విధంగా మార్గదర్శకాలను మార్చారు. ఏప్రిల్ నుంచి అందరికీ కల్యాణలక్ష్మీ సాయం అందనుంది..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy