లక్షా 25 వేల ఆవు పిడకలతో భోగి మంటలు

BHOGI RECORDతెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ కృష్ణలంకలో ఆదివారం సంక్రాంతి సంబరాల అంబరాన్నంటాయి. ఏపిఆర్‌ఎం పాఠశాలలో సేంద్రియ పదార్థం అయిన ఆవు పేడతో చేసిన సుమారు లక్షా 25 వేల పిడకలతో భోగి మంటలను వేశారు. ఆవు పిడకలతో సనాతన సంప్రదాయాలను గుర్తుకు తెచ్చే విధంగా భోగి మంటల కార్యక్రమాన్ని అమరావతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ఆవు నేతితో భోగిమంటలను వెలిగించారు. ఆవు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, ఆవుతో ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయం చేస్తే, అటు భూమి ఇటు ప్రజానీకం ఆరోగ్యంగా ఉంటారని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ఆవు పిడకలతో వేసే భోగి మంటల వల్ల ప్రకృతిలోని వాతావరణ కాలుష్యం తొలగిపోతుందని, ప్రజలకు ఆరోగ్యం సమకూరుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇక్కడి మైదానంలో హరిదాసులు, గంగిరెద్దుల సందడి నెలకొంది. మంత్రి మాణిక్యాలరావు చేతుల మీదుగా హరిదాసులను, గంగిరెద్దుల వారిని సత్కరించారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy