లక్ష్మీనారాయణ వీఆర్ఎస్‌కు సర్కార్ ఓకే

laxminarayanaమహారాష్ట్ర అదనపు డీజీపీ సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీఆర్‌ఎస్‌ కోరుతూ లక్ష్మీనారాయణ ఇటీవల మహారాష్ట్ర డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్-25) ఆమోదం తెలిపింది.IPS లక్ష్మీనారాయణ గతంలో డిప్యూటేషన్‌పై ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. నిజాయతీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కొన్ని ముఖ్యమైన కేసుల్లో చూపించిన తెగువతో ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. తర్వాత లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు.

రాజకీయాల్లోకి వచ్చేందుకు లక్ష్మీనారాయణ ఉద్యోగానికి స్వస్తి చెప్పారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన వీఆర్ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు లక్ష్మీనారాయణ ఇదివరకే ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వివిధ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. అయితే రాజకీయ రంగ ప్రవేశంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఏపీ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే అదే సమయంలో ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy