లక్ష్య చేధనలో పోరాడుతున్న టీంఇండియా

14ఆక్లాండ్ టెస్ట్ లో మూడో రోజు ఆట ప్రారంభించిన టీంఇండియా మిగతా వికెట్లను త్వరగానే కొల్పోయింది. ఆట ప్రారంభం కాగానే గ్రీజులో ఉన్న రోహిత్ శర్మ, రహానే వికెట్లను కొల్పోయింది. తర్వాత వచ్చిన ధోని, జడేజా లు వికెట్ల పతనాన్ని ఆపలేకపోయారు. 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వాంగర్ నాలుగు వికెట్లు తీయగా బౌల్ట్, సౌథీలకు మూడు వికెట్లను పడగొట్టారు.

అంతకు ముందు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్ల వికెట్లను తర్వగానే కొల్పోయింది. టేలర్ మినహా… మిగతా బ్యాట్స్ మెన్ వికెట్లను త్వరగానే సమర్పించుకున్నారు. వికెట్లను తీయడంలో ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ తలో మూడు వికెట్లు పడగొట్టారు. జహీర్  ఖాన్ రెండు వికెట్లు తీయగా జడేజా ఒక వికెట్ తీసారు. 105 పరుగులకే న్యూజిలాండ్ ను ఆలౌట్ చేశారు.

వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీం ఇండియా మురళీ విజయ్ వికెట్ ను త్వరగానే సమర్పించుకుంది. 407 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా 36 పరుగులకే మొదటి వికెట్ కొల్పోయింది. 22 పరుగులతో పుజారా, 49 పరుగులతో థావన్ గ్రీజులో ఉన్నారు. విజయానికి భారత్ ఇంకా 320 పరుగుల దూరంలో ఉంది. మిగతా బ్యాట్స్ మెన్ కూడా పోరాడితే గెలుపు సాధ్యమవుతుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy