లక్ష ఖర్చుతో..బంగళాపైనే వ్యవసాయం

terrosవ్యవసాయం చేయాలంటే కనీసం ఒక ఎకరం పొలమైనా ఉండాలి. దుక్కి దున్ని పంట చేతికొచ్చే వరకు ఆరుగాలం కష్ట పడాలి. అప్పుడే కష్టానికి తగిన పలితం దక్కుతుంది. అయితే గ్రామాలకే పరిమితమైన వ్యవసాయం ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలకు పాకింది. సాగు చేయాలంటే ఎకరాల్లో భూమి ఉండాల్సిన అవసరం కూడా లేదు. తక్కువ స్థలంలోనే అది కూడా ఎక్కడో కాదు మనం ఉండే ఇంటిపైనే పంటలు పండించుకోవచ్చు. మల్టీ లెవల్ టెర్రస్ గార్డెన్లను చేపట్టేందుకు చర్యలు చేపట్టింది ఉద్యాన శాఖ. ఇప్పటి వరకు ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఈ టెర్రస్ గార్డెనింగ్ ను హైదరాబాద్ లో త్వరంలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తక్కువ స్థలంలో ప్లాస్టిక్ తో ఏర్పాటుచేసిన మెట్లు నిర్మించి.. వాటిపై ఆకు కూరలు, కూరగాయలు పెంచుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా నీటి సరఫరా వ్యవస్థ ఉంటుందని..చిన్నపాటి బిల్డింగ్ పై తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చని ఉద్యాన శాఖ కమిషనర్ తెలిపారు. ఈ టెర్రస్ ఏర్పాటుకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. త్వరలో జీడిమెట్లలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ల ప్రజల పరిశీలన కోసం ఈ గార్డెన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన వచ్చన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి అందజేస్తామన్నారు. టెర్రస్ గార్డెనింగ్ కు ప్రభుత్వం సబ్సిడీపై  ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నగరంలో కాలుష్యం పెరుగుతున్న క్రమంలో టెర్రస్ గార్డెనింగ్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy