లగడపాటిని మించిపోయారు

kosovo-parliament_650x400_71444347616ఆందోళనలు చేయడంలో మా రూటే సెపరేటు అంటున్నారు కొందరు ఎంపీలు. ఆ మధ్య లగడపాటి పార్లమెంట్ లో చిన్న పెప్పర్ స్ప్రే వదిలితేనే అంతా హడలిపోయారు. కానీ ఓ దేశంలో ఎంపీలు మాత్రం లగడపాటిని మించిపోయారు. సభలో ఉన్నోళ్లందరితో కన్నీళ్లు పెట్టించారు. హాస్పిటళ్లో జాయిన్ అయ్యేలా చేశారు. ఆందోళనల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంతకి వాళ్లేం చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరే చదవండి..

సర్కారుపై వ్యతిరేకతను తెలియజేయడంలో కొత్త అధ్యయానికి తెర తీశారు యూరప్ లోని కొసోవో స్టేట్ ఎంపీలు. తమ మాట వినకుంటే ఎంతకైనా తెగిస్తామని నిరూపించారు. ముందుగా మాటల్లో చెప్పి చూశారు.. అయినా ప్రభుత్వం వినకపోయేసరికి.. ఏకంగా సభలోకే టియర్ గ్యాస్ షెల్స్ పట్టుకొచ్చి అంటించారు. ఆల్బిన్ కుర్తీ అనే పార్లమెంట్ సభ్యుడు నాలుగు భారీ టియర్ గ్యాస్ షెల్స్ సభలోకి తీసుకొచ్చి ఓపెన్ చేశాడు. దీంతో పార్లమెంట్ హాల్ మొత్తం పొగతో నిండిపోయింది.

2745ఒక్క టియర్ గ్యాస్ షెల్సే కాదు… విజిల్స్ తోనూ ఆందోళన చేయవచ్చని నిరూపించారు కొసోవో ఎంపీలు. విజిల్స్ తో పార్లమెంట్ లో మోతమోగించారు. దూరంగా ఉండి విజిల్స్ వేస్తే వినిపిస్తుందో లేదో అనుకున్నారేమో… డైరెక్ట్ గా అధికార పార్టీ ఎంపీలు, స్పీకర్, సభ అధికారుల దగ్గరకు వెళ్లి మరీ వారి చెవుల్లోనే విజిల్స్ ఊదారు. వీరి చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిని కూడా బెదిరించాడు. ఇలా పార్లమెంట్ లో ఆందోళనలు చేయడం వీరికి కొత్తేం కాదు. గతంలో కూడా ఇలాంటి ఘనకార్యాలు చాలానే చేశారు. ప్రభుత్వతీరును నిరసిస్తూ.. అధికారపార్టీ నేతలపై ఏకంగా కోడిగుడ్లు విసిరారు అపోజిషన్ పార్టీ ఎంపీలు.

అసలు.. ఈ రేంజ్ లో ఆందోళనలు చేయడానికి ఓ కారణం ఉంది. కొసోవో స్టేట్ యూరప్ లో ఉంది. గతంలో సెర్బియా ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతం 2008లో స్వాతంత్ర్యం పొందింది. అయితే.. రెండు సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలపై సెర్బియాకు ఎక్కువ అధికారాలిస్తూ… కొసోవో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్కారు డెసిషన్ పై అపోజిషన్ పార్టీలు మొదటి నుంచి ఆందోళనలు చేస్తున్నాయి. అయినా సర్కారు వెనక్కితగ్గకపోవడంతో… ఇలా టియర్ గ్యాస్,  విజిల్స్, కోడిగుడ్ల ఉద్యమానికి తెరతీశారు. పొగతో సభ్యులంతా తలోదిక్కు పరుగులు తీశారు. టియర్ గ్యాస్ ఎఫెక్ట్ తో చాలామంది ఎంపీలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. టియర్ గ్యాస్ దెబ్బతో పార్లమెంట్ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy