లగ్జరీ ఫుడ్ గా పప్పు భోజనం

Pulses AFPఒప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే పప్పులు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి.  పప్పు భోజనం ప్రస్తుతం లగ్జరీ ఫుడ్ అయ్యింది. సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పప్పుతో సరిపెట్టుకునే జనం  ఆవైపు చూడాలంటే జంకుతున్నారు. కంది, పెసర, శెనగ, మినపపప్పు.. ఇలా అన్ని పప్పు ధరలు… ఒకేసారి అమాంతం పెరిగాయి. పప్పుల ధరలన్నీ అటు ఇటుగా డబుల్ సెంచరీకి రీచ్ అయ్యాయి. పప్పుల ధరలకు ఆయిల్ రేట్లు తోడయ్యాయి. వీటి రేట్లు సలసలా కాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే… పప్పులూ, నూనెల ధరలు వంద నుంచి 150 శాతం వరకు పెరిగాయి.

imagesమొన్నటిదాకా ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తే.. పండగ సీజన్ లో పప్పుల ధరలు టెన్షన్ పెడుతున్నాయి. దసరా జరుపుకోవాలంటే నెలబడ్జెట్ సరిపోని పరిస్థితి సామాన్యులది. కిలో కందిపప్పు కాస్త అటు ఇటుగా డబుల్ సెంచరీకి చేరింది. గతేడాది దసరా టైంలో కందిపప్పు ధర 74 రూపాయలు మాత్రమే. ఇక మినప్పప్పు మార్కెట్లో 190ని తాకింది.. ఇపుడు మార్కెట్లో  శనగపప్పు కొనాలంటే  రూ.130  పెట్టాల్సిందే. పెసర పప్పు ధర అటు ఇటుగా 125కి చేరింది.

పప్పులకు తోడు అన్ని రకాల నూనె ధరలకు లీటర్ ప్యాకేట్ సెంచరీని కొట్టాయి. రెండొందలు పెట్టి కందిపప్పు కొనేబదులు… రెండు కిలోల చికెన్.. ఐదు కేజీల ఉల్లి కొనుక్కోవచ్చన్న అభిప్రాయానికొస్తున్నారు. పప్పుల జోలికెళ్లే బదులు నాన్ వెజ్ కు.. పనీర్, మసాలాలు జోడించి మరింత గ్రాండ్ గా చేసుకోవడం బెటరనుకుంటున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ధరల మోత మోగుతోంది. పప్పు ధాన్యాలను ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్ర, కర్నాటక, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సాధారణం కంటే 14 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం కూడా రేట్ల పెరుగుదలకు కారణమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పండ్లు, కూరగాయల ధరలు కూడా రెండు నెలల్లో భారీగా పెరిగాయి. ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప పెరిగిన ధరలు దిగిరావనే డిమాండ్ విన్పిస్తోంది. అంతే కాదు ఒకప్పుడు అప్పు చేసి పప్పుకూడన్నడ సామెత …ఇప్పడు నిజమనిస్తోంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy