‘లవర్స్’ ఆడియో లాంచ్ చేసిన సమంత..

lovers 01 lovers03సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటిస్తున్న సినిమా ‘లవర్స్’. మారుతి టాకీస్, మాయా బజార్ బ్యానర్ పై మారుతి ప్రజెంట్ చేస్తుండగా.. సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జె.బి. మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో లాంచ్ హైదరాబాద్ లో జరిగింది. వి.వి.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత, ఎమ్మెస్ రాజు, కె.ఎస్ రామారావు, బెల్లకొండ సురేష్, నవదీప్, నాగశౌర్య, రాజీవ్ కనకాల, తదితరులు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. సమంత ఆడియో లాంచ్ చేయగా.. త్రివిక్రమ్ ట్రైలర్ రీలీజ్ చేశారు. మాయాబజార్ మూవీ లోగోను వి.వి.వినాయక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జె.బి. అందించిన మ్యూజిక్ బాగుందని పలువురు అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

 

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy