లవ్@ఫస్ట్ సైట్ : ఓ ఎమ్మెల్యే.. ఓ సబ్ కలెక్టర్ ఇదీ స్టోరీ

mla-collecterసరైనోడు మూవీ చూశారా.. ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్  మహిళా ఎమ్మెల్యేను పడేస్తాడు.. ఎమ్మెల్యేకు మొగుడు రాడా అంటూ డైలాగులు పేలుస్తాడు హీరో అల్లు అర్జున్. ఆ మూవీలో ఆవారాగా తిరిగే హీరో ఎమ్మెల్యేతో లవ్ లో పడితే.. రియల్ స్టోరీలో మాత్రం ఓ యంగ్ ఎమ్మెల్యే.. సబ్ కలెక్టర్ ను ప్రేమించాడు. ఇద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కేరళలోని అరువిక్కర నియోజకవర్గంకు శబరినాథన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే అదే రాష్ట్రానికి చెందిన IAS అధికారి, తిరువనంతపురం సబ్ కలెక్టర్  దివ్యనాయర్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా పోస్ట్ ద్వారా వెల్లడించారు. తిరువనంతపురంలో 2016లో ఓ ఫంక్షన్ లో ఫస్ట్ టైం సబ్ కలెక్టర్ దివ్యను కలిశారు ఎమ్మెల్యే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు మొదటి చూపులోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందన్నారు శబరినాథన్. తన మనసులోని మాటను సబ్ కలెక్టర్ కు చెప్పారు ఎమ్మెల్యే. ఇద్దరి ఆలోచనలు, మనసులు కలవటంతో ఒక అవగాహనకు వచ్చారు. ఆరు నెలల ప్రేమ తర్వాత.. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఈ జంట. రెండు కుటుంబాలు ఓకే కూడా చెప్పాయి. 2017 జూన్ నెల చివరిలోనే వివాహం జరగనున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే శబరినాథన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంబీఏ చదివారు. ఇతనిది రాజకీయ కుటుంబం. తండ్రి  కేరళ అసెంబ్లీ మాజీ స్పీకర్ కార్తికేయన్. TCSలో ఉద్యోగం చేస్తూ.. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. సబ్ కలెక్టర్ దివ్య MBBS చదివారు. 2013 సివిల్స్ రాసి 48వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా పని చేస్తున్నారు. 2016 కేరళ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతూ.. స్వయంగా పాట రాసి, పాడి వీడియో విడుదల చేశారు. అది దేశవ్యాప్తంగా దివ్యకు గుర్తింపు తెచ్చింది. ఓ ఎమ్మెల్యే.. ఓ సబ్ కలెక్టర్ ను పెళ్లి చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy