లవ్ జిహాద్ పేరుతో క్రూరత్వం : సుత్తితో కొట్టి చంపి.. తగలబెట్టాడు

Rajasthan-Murdererఓ మనిషి.. ఇంకో మనిషిని ఎలా వ్యక్తిగత కక్షలు లేకుండానే ఇంత దారుణంగా కూడా కొట్టి చంపుతాడా.. ఇలా కొట్టాడు అంటే వాడు మనిషేనా అనే డౌట్ వస్తుంది. అత్యంత కిరాతకంగా వ్యవహరించిన వీడు మాత్రం మనిషే కాదు అంటోంది సమాజం. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. లవ్ జిహాద్ పేరిట తను చేసిన క్రూరత్వాన్ని స్వయంగా వీడియో తీసుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒళ్లు మండిపోయేలా.. అత్యంత క్రూరత్వంగా ఉన్న ఈ వీడియో చూసి షాక్ అయ్యారు నెటిజన్లు. ఇలా జరిగిన కొన్ని నిమిషాల్లో గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్ నుంచి ఈ వీడియోను తొలగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్రం రాజ్ సమంద్ జిల్లాలో శంబూనాథ్ రాయ్ గర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడి వయసు 30 వరకు ఉంటాయి. లవ్ జిహాద్ పై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మహమ్మద్ భట్టా షైక్ అనే వ్యక్తిని కొట్టి చంపేశాడు. రాజ్ నగర్ ప్రాంతంలోని దేవి హెరిటేజ్ రోడ్డులోని ఓ పార్క్ లో మహమ్మద్ భట్టా షైక్ ఉన్నాడు. అతడిపై శంబునాథ్ ఓ సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు శంబూనాథ్ ను అరెస్ట్ చేశారు. కొట్టి చంపటాన్ని సమర్ధించుకుంటున్నాడు. లవ్ జిహాద్ ను అమ్మాయిలను కాపాడటానికే ఇలా చేశానని చెబుతున్నాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో నేనే పోస్ట్ చేశానని చెబుతున్నాడు. అయితే ఇది శంబూనాథ్ ఒక్కడే చేశాడనేదానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మరో వ్యక్తి ఉండి ఉంటాడని చెబుతున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు.

ఈ ఘటనపై రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. ఘటనపై సిట్ బృందాన్ని నియమించారు. పరిస్థితి అదుపులోనే ఉందని.. అందరూ సంయమనం పాటించాలని కోరారు మంత్రి చంద్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy