లాతూర్ కి వందసార్లు తిరిగింది..

latur-kHCD--621x414@LiveMintవర్షాలు లేని కారణంగా వేసవిలో తీవ్ర నీటిని ఎద్దడిని ఎదుర్కొంది మహారాష్ట్రలోని లాతూరు ప్రాంతం. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. దీంతో  సమస్య  పరిష్కారానికి రంగంలోకి దిగిన రైల్వే శాఖ మొట్టమొదటిసారిగా నీటిని రైలు ద్వారా ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చి వారి దాహార్తిని తీర్చింది. జల్ ధూత్ పేరుతో నడిచిన ఈ రైలు శనివారంతో 100 సార్లు నీటిని లాతూర్ ప్రాంతానికి చేర్చింది.మొదట 10 వ్యాగన్లతో ప్రారంభమై చివరకు 50 వ్యాగన్లకు చేరుకుంది. ఇప్పటిదాకా దాదాపు 24 కోట్ల లీటర్ల నీటిని లాతూరుకు సరఫరా చేశారు. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పటికీ నీటిని ఇలా రైలు ద్వారా ప్రజలకు అందిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy