లారీని ఢీ కొన్న కారు: నలుగురు మృతి

carపెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం బలైపోయింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భార్యభర్తలతోపాటు .. చిన్నారులైన కొడుకు, కూతురు ప్రమాదంలో చనిపోయారు.

మంథనికి చెందిన చదువాల అరుణ్ కుమార్ .. భార్య సౌమ్య, కొడుకు అఖిలేష్, కూతురు శాన్వి ప్రమాదంలో చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి మంథని వెళ్తుండగా.. తెల్లవారు జామున రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నడుపుతున్న అరుణ్ కుమార్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. నలుగురు ముందు సీట్లోనే కూర్చోవడంతో ఎవరూ ప్రాణాలతో మిగలలేదు. కొనప్రాణంతో ఉన్న బాలుడు అఖిలేష్ ను..పోలీసులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే అఖిలేష్ కూడా చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.

మంథనిలో కృష్ణవేణి స్కూల్ యజమాని అయిన అరుణ్ కుమార్.. హైదరాబాద్ లో తన తమ్ముడు సాయికుమార్, బావమరిది ఓంప్రకాశ్ లను పాలిటెక్నిక్  కాలేజీలో చేర్చించి.. మంథనికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని గమనించక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు.  నలుగురి మృతదేహాలను సుల్తానాబాద్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy