లారెన్స్..’కాంచన-3’ ఫస్ట్ లుక్ విడుదల

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తెరకెక్కించిన సినిమా ‘కాంచన- 3’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ అయ్యింది. ఇందులో లారెన్స్   రాఘవ తెల్ల పంచె కట్టు, తెల్ల జుట్టు, గడ్డం, మెడలో రుద్రాక్షలు ధరించి స్టైల్‌గా… లారెన్స్ కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

2007లో ‘ముని’ సిరీస్‌ నుంచి మొదలుపెట్టి .. దీనికి సీక్వెల్ గా కాంచన… ఆ తర్వాత  ముని-3.. కాంచన-2 గా ‘గంగ’ సినిమాను తెరకెక్కారు. ఇప్పుడు ‘కాంచన- 3’ సినిమాను తీశారు. ఈ సినిమా షూటింగ్ మంగ‌ళ‌వారం పూర్తైంది. తాజాగా ఫ‌స్ట్ లుక్ విడుదల చేశారు. వేదిక‌, నిక్కీ తంబోలి, ఓవియా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు… తమన్‌ సంగీతం అందించాడు. సన్‌ పిక్చర్స్‌, రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా… ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy