లార్డ్స్ టెస్ట్ : భారత్ 107 రన్స్ కే ఆలౌట్

ఇంగ్లాండ్ తో  జరుగుతున్న  రెండో టెస్టులో  భారత  బ్యాట్స్ మెన్  మరోసారి విఫలమయ్యారు.  ఇంగ్లాండ్  బౌలర్ల  ధాటికి ….టీమిండియా  టాప్ ఆర్డర్  కుప్పకూలింది.   35.2  ఓవర్లలోనే….. 107 పరుగులకే  భారత్  తొలి ఇన్నింగ్స్ ముగిసింది.  టాస్ గెలిచి  ఇంగ్లాండ్  కెప్టెన్  జో రూట్ ….భారత్ ను  బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.  కేఎల్  రాహుల్ తో  ఇన్నింగ్స్  ఆరంభించిన  మురళీ విజయ్…. ఖాతా తెరవకుండానే  పెవిలియన్ కు  చేరాడు.

అండర్సన్  వేసిన   తొలి ఓవర్  ఐదో బంతికే ….విజయ్  బౌల్డ్  అయ్యాడు.  తర్వాత  అదే జోరుతో  అండర్సన్  ఏడో ఓవర్ లో ….KL రాహుల్ ను   8 పరుగులకే  పెవిలియన్ కు  పంపాడు.  మరోవైపు  వన్ డౌన్ బ్యాట్స్ మెన్  పుజారా  25 బంతుల్లో  కేవలం ఒకే  ఒక్క  పరుగుతో వెనుదిరిగాడు.  తొమ్మిదో  ఓవర్ లో  పుజారా రనౌట్  అయ్యాడు.

వర్షం  విరామం  తర్వాత  కెప్టెన్ కోహ్లీ,  రహానే ఇన్నింగ్స్ ను  చక్కదిద్దే  ప్రయత్నం చేశారు. ఇంగ్లండ్  స్వింగ్  బౌలింగ్ ను  సమర్థంగా  ఎదుర్కొంటూ  బ్యాటింగ్ కొనసాగించారు.  క్రీజులో  కుదురుకున్నారు  అనే  సమయంలో  కెప్టెన్ కోహ్లీ ఔటయ్యాడు.  క్రిస్ వోక్స్  …. ఔట్ స్వింగర్ తో …..విరాట్ ను  పెవీలియన్ కు  పంపాడు. తర్వాత  స్లిప్ లో …. బట్లర్ కు  క్యాచ్  ఇచ్చి  కోహ్లీ  పెవిలియన్  చేరడంతో …నాలుగో వికెట్ కు  34 పరుగుల  భాగస్వామ్యానికి  తెరపడింది. ఆ తర్వాత  బ్యాటింగ్ కు  వచ్చిన  హార్దిక్ పాండ్యా  సైతం   వోక్స్ బౌలింగ్ లో…. స్లిప్ లో  బట్లర్ కు  క్యాచ్  ఇచ్చి  ఔటయ్యాడు.  ఆ వెంటనే   దినేశ్ కార్తీక్ ను ….సామ్ కర్రాన్ … క్లీన్ బౌల్డ్  చేశాడు. ఇక  రహానే కూడా  సహచరులను  అనుసరిస్తూ  అండర్సన్ కు  వికెట్ సమర్పించుకున్నాడు.  ఇక్కణ్నుంచి  భారత్  ఏ దశలోనూ  కోలుకోలేకపోయింది . తొలి ఇన్నింగ్స్  107 పరుగులకే  ఆలౌట్ అయింది.  అశ్విన్  29, కోహ్లీ23  పరుగులు మినహా ….ఎవరూ  చెప్పుకోదగ్గ   ప్రదర్శన  కనబరుచలేదు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy