లాల్ బహదూర్ శాస్త్రి 111వ జయంతి

0f44868c232e1973a55b812e73644fb6దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 111వ జయంతి.  ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ ఆకస్మిక మరణంతో… ఆ పదవిని చేపట్టారు శాస్త్రి. 1904లో వారణాసిలో జన్మించిన శాస్త్రి…  మహాత్ముని స్పూర్తితో స్వాతంత్రం కోసం ఉద్యమించారు. ఉప్ప సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 9ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్రం తర్వాత… ఉత్తరప్రదేశ్ లోని గోవింద్ వల్లభపంత్ ప్రభుత్వంలో రవాణా శాఖామంత్రిగా పనిచేశారు. బస్సుల్లో మహిళా కండక్టర్లను నియమించింది శాస్త్రీనే. హోంమినిష్టర్ గానూ పనిచేశారు. 1951లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు శాస్త్రి. 52లో రాజ్యసభకు ఎన్నికై… నెహ్రూ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. 56లో మహబూబ్ నగర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ… మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనిని నెహ్రూ ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. 3నెలల తర్వాత తమిళనాడులో మరో రైలు యాక్సిడెంట్ జరిగింది. దీని తర్వాత… శాస్త్రి రాజీనామా ఆమోదించారు నెహ్రూ. 1957లో శాస్త్రీని మళ్లీ కేబినెట్ లోకి తీసుకున్నారు నెహ్రూ. కామర్స్ అండ్ ఇండస్ట్రీ బాధ్యతలు అప్పగించారు. తర్వాత హోంమినిష్టర్ గా పనిచేశారు శాస్త్రి. నెహ్రూ మరణం తర్వాత గుల్జారీ నందా ప్రధానమంత్రిగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో 9రోజులు విదేశాంగ శాఖా మంత్రిగానూ పనిచేశారు. 1964 జూన్ 9న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహదూర్ శాస్త్రి. నెహ్రూ సోషలిస్ట్ విధానాలను పాటిస్తూనే పాలనపై తనదైన ముద్ర వేశారు శాస్త్రి. 1965 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్దంలో భారత్ విజయం… శాస్త్రి కీర్తిని పెంచింది. ఈ టైమ్ లోనే ఆయన జైజవాన్ జైకిసాన్ నినాదాన్నిచ్చారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. సోవియట్ యూనియన్ తో సన్నిహిత సంబంధాలు, చైనా, పాకిస్థాన్ లతో శాంతి చర్చలు, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేతో తమిళుల సమస్యపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన సమావేశంలో పాల్గొని ఇండియా తిరిగొస్తూ పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో ఆగారు. ఆ టైమ్ లో పాక్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ప్రోటోకాల్ పక్కనబెట్టి ఎయిర్ పోర్టుకు వచ్చి శాస్త్రితో లంచ్ చేశారు. 1965లో ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో శాస్త్రి కీలక పాత్ర పోషించారు. 1966లో తాష్కెంట్ లోని సదస్సుకు హాజరయ్యారు శాస్త్రి. 1966 జనవరి 10న తాష్కెంట్ అగ్రిమెంట్ పై సంతకం చేశారు. అదే రోజు రాత్రి 2గంటల సమయంలో హఠాత్తుగా కన్నుమూశారు. హార్ట్ ఎటాక్ తో శాస్త్రి చనిపోయారని డాక్టర్లు తేల్చారు. అయితే… లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ఇప్పటికీ మిస్టరీ కొనసాగుతూనే ఉంది.

9160

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy