లాస్ట్ ఛాన్స్ : జియో గ్రేస్ ప్లాన్

1476452529_would-you-pay-jio-simరిలయన్స్ జియో.. తన నాన్ ప్రైమ్, ప్రైమ్ కస్టమర్లకు మరో అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ 10 వరకు ఉచిత జియో సర్వీసులు పొంది.. ప్రైమ్ లో చేరని కస్టమర్లు.. రూ. 99 రీఛార్జ్ తో జియో ప్రైమ్ మెంబర్ గా జాయిన్ అయి.. ఏ ఇతర రీఛార్జ్ ప్లాన్స్ చేసుకోని కస్టమర్లకు జియో చిట్ట చివరి అవకాశం ఇచ్చింది. వీళ్లకోసం జియో గ్రేస్ ప్లాన్ ఆఫర్ ను ప్రకటించింది. ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోని కస్టమర్లు.. ఆటోమేటిక్ గా జియో గ్రేస్ ప్లాన్ లోకి వస్తారని ప్రకటించింది.

ఈ గ్రేస్ ప్లాన్ లో రూ. 309, రూ. 349, రూ. 549లో ఏదో ఒకటి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీఛార్జ్ చేసుకున్న దగ్గర నుంచి 84 రోజుల పాటు ఆయా ప్లాన్స్ ప్రకారం జియో సర్వీసులను పొందవచ్చు. ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోకపోయినా..  జియో గ్రేస్ ప్లాన్ లో భాగంగా 128 కేబీపీఎస్ నెట్ స్పీడ్ తో పాటు, జియో నెట్ వర్క్, ఉచిత కాల్ (2లక్షల 59 వేల 200 నిమిషాలు) సదుపాయం(జియో టు జియో మాత్రమే), రోజుకి 100 SMS లు లభించనున్నాయి. ఇందులో ప్రీమియం సర్వీస్ యాప్స్ ఏవీ కూడా వాడుకునే అవకాశం లేదు. గ్రేస్ ప్లాన్ ఆఫర్ గడువు అక్టోబర్ 12గా నిర్ణయించింది జియో. దేశవ్యాప్తంగా 72 మిలియన్ల మంది జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్నారని అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు.

ఇదివరకు సమ్మర్ ఆఫర్ ప్రకటించినా.. ట్రాయ్ అభ్యంతరం చెప్పడంతో ఆ ఆఫర్ ను విరమించుకుంది. రద్దు చేసిన గడువుకు ముందు రూ. 303 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు మూడు నెలలపాటు ఉచిత సర్వీసులను పొందవచ్చని తెలిపింది. ఈ కస్టమర్లకు జియో ధన్ ధనా ధన్ ఆఫర్ ను సెపరేట్ గా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది జియో.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy