లాహోర్ లో మోడీ స్నేహగీతం

MODI SHARIF (8)భారతప్రధాని నరేంద్రమోడీ…. పాకిస్థాన్ పర్యటన ముగిసింది. పాక్ పీఎం నవాజ్ షరీఫ్ తో భేటీ ముగిసిన తర్వాత ఇండియాకు బయలదేరారు మోడీ. ఆఫ్ఘనిస్థాన్ పర్యటన తర్వాత నవాజ్‌ షరీఫ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను స్వయంగా కలిసేందుకు  లాహోర్‌ వెళ్లారు మోడీ. అయితే అదే సమయంలో షరీఫ్‌ ఇంట్లో ఆయన మనవరాలి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. షరీఫ్‌ ఇంట్లోని పెళ్లి వేడుకల్లో చీఫ్ గెస్టుగా మోడీ పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌.

అంతకు ముందు మోడీకి ఘనస్వాగతం పలికారు షరీఫ్. లాహోర్ లోని జాటి ఉమ్రాలో ఉన్న తన రాయల్ ప్యాలెస్ కు మోడీని తీసుకెళ్లారు. అక్కడే మనవరాలి పెళ్లి సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  ఇద్దరు పీఎంలూ కలిసి ముచ్చటించుకున్నారు. ఈ భేటీలో మోడీకి కాశ్మీరీ ఛాయ్, పాయసం ఇచ్చారు షరీఫ్.

ఒకవైపు పొగడ్తలు.. మరోవైపు విమర్శలు

అయితే పాకిస్థాన్ పర్యటనపై ఒకవైపు పొగడ్తలతో ముంచెత్తుతుంటే.. మరోవైపు విమర్శలు అంతేస్థాయిలో వస్తున్నాయి. మోడీ పాకిస్థాన్‌ పర్యటనను కాశ్మీర్‌ వేర్పాటువాదులు స్వాగతించారు. మోడీ పర్యటన ఆశ్చర్యానికి గురి చేసిందని వ్యాఖ్యానించింది సీపీఐ. ఈ సమావేశంతో రెండు దేశాల ద్వైపాక్షిక చర్చల ప్రక్రియ ముందుకెళ్తుందని ఆ పార్టీ తెలిపింది.

మరోపక్క మోడీ పాక్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఆప్ కూడా మోడీ పాక్‌ ఆకస్మిక పర్యటనపై విమర్శల వర్షం కురిపించింది. ఈ  పర్యటనతో ఇప్పుడు దేశంలో ఏమైనా పెను మార్పులు వస్తాయా అంటూ ఎద్దేవా చేసింది.  ప్రధానుల మధ్య స్నేహభావం పెరిగితే.. ఉగ్రవాదం అంతరిస్తుందా అంటూ  ప్రశ్నించారు ఆప్‌ సీనియర్‌ నేత అశుతోష్‌. ఇన్నాళ్లూ వ్యతిరేకించి ఇప్పుడొక్కసారిగా ఈ స్నేహగీతం ఎందుకు ఆలపిస్తున్నారో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy