లింక్ పెడుతున్నారు : గ్రాము బంగారం కొన్నా పాన్ కార్డ్ కావాలి

gold-panనాలుగు రూపాయల ఆదాయం పెరిగినా.. నాలుగు కట్టలు చేతికి వచ్చినా ఠక్కున గుర్తు వచ్చేది బంగారం. కొనేసి పడేస్తే సరిపోతుంది.. అలా ఉంటుంది.. అవసరానికి అక్కరకు వస్తుంది.. ఇదీ సామాన్య, మధ్య తరగతి ఆలోచన. ఇక నుంచి కూడా మీ ఆలోచనలో మార్పు రాకపోవచ్చుగానీ.. కొనుగోలు విధానంలో మాత్రం తప్పనిసరిగా మార్పు రాబోతున్నారు. డబ్బులు తీసుకెళ్లి బంగారం కొనేద్దాం అనుకునే వారు.. ఇక నుంచి పాన్ కార్డ్ కూడా షాపుకి తీసుకెళ్లాలి. అవును ఇక నుంచి రెండు లక్షల రూపాయల కంటే అదనంగా కొనుగోలు చేస్తేనే పాన్ నెంబర్ ఇవ్వాలి.. రాబోయే కాలంలో గ్రాము బంగారం కొనుగోలు చేసినా పాన్ కార్డ్ వివరాలు విధిగా సమర్పించే విధంగా కేంద్రం నిబంధనలు తీసుకురాబోతున్నది.

బంగారం కొనుగోలు చేసే సమయంలో విధిగా పాన్ కార్డ్ వివరాలు సమర్పించాలనే నిబంధను త్వరలోనే కేంద్రం ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలపై ఏర్పాటైన కమిటీ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎక్కువ మొత్తంలో నల్లదనం బంగారం రూపంలో ఉంటుందని.. దీన్ని అరికట్టాలంటే పాన్ కార్డ్ కు లింక్ పెడితే.. చాలా వరకు బ్లాక్ మనీని బయటకు రాబట్టవచ్చని.. పన్ను పరిధిలోకి వస్తుందని సూచించింది.

ఈ నిబంధన వల్ల నల్లదనంగా మారుతున్న బ్లాక్ మనీని కంట్రోల్ చేయొద్దని అభిప్రాయపడింది కమిటీ. ఇప్పటి వరకు రూ.2లక్షల కంటే అదనంగా బంగారం కొనుగోలు చేసే వారు పాన్ కార్డ్ వివరాలు సమర్పించాలి.. ఇక నుంచి గ్రాము బంగారం కొనాలన్నా పాన్ తప్పనిసరిగా సమర్పించేలా కేంద్రం ఆలోచన చేస్తోంది. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy