లిక్కర్ షాపులు: లీజు ఏడాదికే

WINEలిక్కర్ షాపుల నిర్వహణపై మరో నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. లైసెన్స్ లీజు కాలాన్ని ఏడాదికే కుదించాలని నిర్ణయించింది. పాత పాలసీలో రెండేళ్లుగా ఉన్న లీజు కాలాన్ని కొత్త ఎక్సైజ్‌ పాలసీలో వన్ ఇయర్ కే పరిమితం చేయనుంది. అలాగే ఆరు శ్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును ఈసారి మూడు శ్లాబులకు కుదించాలని డిసైడ్ అయ్యింది. మొదటి రెండు శ్లాబుల పరిధిలోకి గ్రామీణ, పట్టణ ప్రాంత షాపులను తీసుకొచ్చి లైసెన్సు ఫీజు పెంచాలని ఆలోచిస్తోంది. షాపు లైసెన్సుతోపాటే పర్మిట్‌ రూం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం కొత్త మద్యం పాలసీకి ఒక రూపాన్ని ఇచ్చి సంబంధిత ఫైల్‌ను సోమవారం (ఆగస్టు28)న సీఎం కేసీఆర్‌ దగ్గరకు అధికారులు పంపారు. దీనిపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

జాతీయ, రాష్ట్రీయ రహదారులకు 500 మీటర్ల దూరంలోపు లిక్కర్ షాపులు నిర్వహించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రభావం నుంచి హైవేలపై ఉన్న మద్యం దుకాణాలను బయటపడేసేందుకు రాష్ట్రీయ రహదారులను డీనోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ క్రమంలో సిటీ ప్రాంతాల్లోని రహదారులకు తమ తీర్పు వర్తించదంటూ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రాష్ట్ర హైవేలపై ఉన్న 561  లిక్కర్ షాపులకు ఇబ్బంది లేకుండా అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,144 మద్యం దుకాణాలు, 852 బార్లు నడుస్తుండగా అందులో 1,184 మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఉన్నాయి.

మద్యం దుకాణాల కోసం ఈసారీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి లాటరీ ద్వారా లైసెన్సు కేటాయించనున్నారు. గతంలో ముందుగా దుకాణం లైసెన్సు కేటాయించి తరువాత రూ. 2 లక్షల ఫీజుతో పర్మిట్‌ రూమ్‌ను అనుమతించే వాళ్లు. ఈసారి లైసెన్సుతోపాటే పర్మిట్‌ రూమ్‌కు అనుమతి ఇవ్వాలనుకుంటున్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy